మహర్షి @ 100 కోట్ల బడ్జెట్

     Written by : smtv Desk | Sat, Dec 08, 2018, 02:51 PM

మహర్షి @ 100 కోట్ల బడ్జెట్

హైదరాబాద్, డిసెంబర్ 08: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ భరత్ అనే నేను సినిమా తర్వాత వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తున్న సినిమా మహర్షి. మహేష్ 25వ సినిమా కాబట్టి ఈ మూవీని ప్రెస్టిజియస్ గా తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా 80 కోట్లపైన బడ్జెట్ అనుకున్నారట. అయితే మరో 10 నుండి 20 కోట్ల దాకా బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.

సినిమా కోసం భారీ సెట్స్ వేస్తున్నారట. మహేష్ ఈ సినిమలో బిజినెస్ మెన్ గా, రైతుబిడ్డగా రెండు పాత్రల్లో కనిపిస్తారట. 100 కోట్ల బడ్జెట్ అంటే ఎలా లేదనన్నా 150 కోట్ల దాకా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. అంత రాబట్టాలి అంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి. మహేష్ స్టామినాకు 150 కోట్లు రాబట్టేయొచ్చు కాని సినిమా అవుట్ పుట్ మీదే అది ఆధారపడి ఉంటుంది.

బడ్జెట్ విషయంలో ఆచితూచి అడుగులేసే దిల్ రాజు మహర్షి విషయంలో కాంప్రమైజ్ అవడం లేదట. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.





Untitled Document
Advertisements