'సిరిసిరిమువ్వ' ఎడిటర్ కె.బాబురావు మృతి

     Written by : smtv Desk | Sat, Dec 08, 2018, 06:05 PM

'సిరిసిరిమువ్వ' ఎడిటర్ కె.బాబురావు  మృతి

హైదరాబాద్ , డిసెంబర్ 08: సిరిసిరిమువ్వ సినిమాకు ఎడిటర్ గా పనిచేసిన కె బాబురావు కన్నుమూసారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. సిరిసిరిమువ్వ చిత్రానికి గానూ ఉత్తమ ఎడిటర్ గా జాతీయ అవార్డును అందుకున్నారు. కళాతపస్వి కే. విశ్వనాథ్‌ దర్శకత్వంలో రూపొందించిన పలు చిత్రాలకు బాబారావు ఎడిటర్‌గా పనిచేశారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం సాగింది.దీంతో పాటే కొన్ని హిందీ సినిమాల‌కు కూడా ఈయ‌న ఎడిటర్ గా చేసారు. బాబురావు మృతిపై సినీ ఇండ‌స్ట్రీ సంతాపం తెలియ‌చేసింది.





Untitled Document
Advertisements