బాలకృష్ణ ఎవరు – నాగ బాబు షాకింగ్ కామెంట్స్!

     Written by : smtv Desk | Sun, Dec 09, 2018, 02:52 PM

బాలకృష్ణ ఎవరు – నాగ బాబు షాకింగ్ కామెంట్స్!

హైదరాబాద్, డిసెంబర్ 09 :అదేంటి.. నటసింహం బాల‌య్య ఎవ‌రో తెలియ‌కుండా ఉంటుందా..? ఈ తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణ తెలియ‌ని వారుంటారా..? మొన్న‌టికి మొన్న కేఏ పాల్ త‌న‌కు బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చిన్న పాటి హేళన చేసాడు . ఇప్పుడు ఇదే కామెడీ నాగ‌బాబు కూడా చేసాడు. ఈయ‌న‌కు నిజంగానే బాల‌య్య అంటే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పి సంచ‌ల‌నం సృష్టించాడు. కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీకి.. జ‌న‌సేన‌కు మ‌ధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దాంతో ఇప్పుడు నాగబాబును ఈ విష‌యం గురించి ప్ర‌శ్న అడిగారు మీడియా మిత్రులు. దానికి నాగ‌బాబు కూడా ఎవ‌రూ ఊహించ‌ని స‌మాధానం చెప్పాడు. త‌న‌కు బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పాడు.





Untitled Document
Advertisements