సమంతాకి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది

     Written by : smtv Desk | Tue, Dec 11, 2018, 11:54 AM

సమంతాకి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది

హైదరాబాద్,డిసెంబర్ 11 :
ఆమె రూపం అందరికీ పరిచయం లేకపోయినా ఆమె స్వరం , గాత్రం మనందరికి సుపరిచితమే , ఆమె ఎవరో కాదు చిన్మయి శ్రీపాద . సింగర్ చిన్మయి గా పరిచయమున్న ఈమె, పలు సినిమాలకు డబ్బింగ్ చెప్పింది . ఈవిడ దుబ్బింగ్ చెప్పిన పాత్రలలో అత్యధికంగా సమంతావే వున్నాయి . అంతే కాకుండా ఈ మధ్యనే వెలుగులోకి వచ్చిన "మీ టూ " ఉద్యమం ద్వారా ఆడవారి సమస్యలపై పోరాడుతుంది .

కాగా ఇటీవల ప్రసిద్ధ దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ లో పలువిషయాలు పంచుకుంది. వివాదాస్పదమయిన మాటలతో సహా వాటిలో కొన్ని చమక్కు లు కూడా ఉన్నాయి . " సమంతాకి నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది , చై , భరద్వాజ్ లు ఇక అంతే " అంటూ చమక్కులు విసరడం మనం ప్రోమో లో చూడవచ్చు .





Untitled Document
Advertisements