ఈ వీడియో వల్ల 2019 లో వైస్సార్సీపీ ఓటర్లు ప్రభవితమవుతారా?

     Written by : smtv Desk | Tue, Dec 11, 2018, 07:52 PM

ఈ వీడియో వల్ల 2019 లో వైస్సార్సీపీ ఓటర్లు ప్రభవితమవుతారా?

హైదరాబాద్ ,డిసెంబర్ 11 :
లీక్ అయిన వీడియోల వల్ల ప్రజలు ఎంత వరకు ప్రభావితమవుతారో తెలియదు గాని , వాటికీ సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు అది రాజకీయనాయకులదైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు . ఒక నాయకుడు నోరుజారితేనే దానిని హెలైట్ చేసి షేర్ చేసి ఆనందం పొందడం ఈ మధ్య జనాలకి అలవాటయి పోయింది .
తాజాగా ఒక వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది ఆ వీడియోలో ఏముందంటే, వైస్సార్సీపీ ఆశావాహి నవీన్ నిశ్చల్ పార్టీ టికెట్ కి సంబంధించి తన పై జరుగుతున్న కుట్రను తన అభిమానులతో చెప్పి బాధపడుతున్నారు . ఆ సందర్భం లో " వైస్ జగన్ " టికెట్ కోసం డబ్బు అడుగుతాడని, పోయిన సారి తమ్ముడు ఇచ్చాడని ఇప్పుడు కూడా 10 కోట్లయినా 15 కోట్లయినా ఇస్తానన్నాడని చెప్పారు . జగన్ మీద ఇప్పటికే అలాంటి ఆరోపణలు ఉండగా ఈ వీడియో తో వాటికి మరింత బలం చేకూరుతుంది . 2019 లో సీఎం పదవి కోసం చూస్తున్న జగన్ని ఒకింత ఇబ్బంది పెట్టే విషయం.





Untitled Document
Advertisements