తెలంగాణ వ్యాప్తంగా నోటా ఫలితాలివి..

     Written by : smtv Desk | Wed, Dec 12, 2018, 10:17 AM

తెలంగాణ వ్యాప్తంగా నోటా ఫలితాలివి..

హైదరాబాద్ , డిసెంబర్ 12: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలా మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 73.2 శాతం పోలింగ్ నమోదైంది. మిగతా 27 శాతం తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కారణం పోలింగ్ కేంద్రం దాకా వెళ్లి ఓటు వెయ్యాలా అనే సోమరితనం ఓ కారణం కాగా, వ్యర్థ రాజకీయాలు చేస్తున్న నేతలకు ఓట్లు ఎందుకు వేయాలి అని అనుకునేవాళ్ళు కూడా చాలా మంది వున్నారు. ఇప్పుడున్న రాజకీయ నేతలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలు, వాళ్లు చేస్తున్న అవినీతి కార్యక్రమాలు, వారికి పాలనాపరమైన అవగాహన లేకపోవడం, పెరుగుతున్న నిరుద్యోగ సమస్య వంటివి యువతలో అసహనాన్ని పెంచాయి.

దీంతో వాళ్ళు నోటాకు ఓటు వేశారు. ఈ ఎన్నికల్లో కూడా నోటాకు కీలకంగా ఓట్లు పోలయ్యాయి. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో.. అత్యధిక స్థానాల్లో నాటోకు వెయ్యికి పైగా ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ప్రకారం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో నోటాకు పోలైన ఓట్లు ఇవీ..

అలంపూర్-3399
ఆదిలాబాద్-1110
అచ్చంపేట-1485
ఆలేరు-1120
ఆర్మూర్-1657
గోషామహల్-643
ఖైరతాబాద్-1314(32 మంది అభ్యర్థుల్లో నోటాకు ఐదో స్థానం)
జూబ్లీహిల్స్-1090
బహుదూర్‌పుర-1210
అంబర్‌పేట్-1372
కార్వాన్-663
చాంద్రాయణగుట్ట-180
చార్మినార్-603
బాన్సువాడ-1549
బాల్కొండ-593
అశ్వరావుపేట-588
ఆందోల్-803
ఆసీఫాబాద్-2602
బెల్లంపల్లి-1943
భువనగరి-1336
బోథ్-2275
భద్రాచలం-2077
బోధన్-1611
దేవరకొండ-1695
భూపాలపల్లి-1360
చెన్నూరు-1726
చేవెళ్ల-1223
చొప్పదండి-2220
దేవరకద్ర-2413
స్టేషన్‌ఘన్‌పూర్-462
జగిత్యాల-1710
ధర్మపురి-2452
డోర్నకల్-1962
హుజురాబాద్-2867
జనగాం-2503
దుబ్బాక-879
గద్వాల్-1285
గజ్వేల్-1546
హుస్నాబాద్-3519
హుజుర్‌నగర్-615
ఇబ్రహీంపట్నం-630
జడ్చర్ల-1034
జుక్కల్-1976
కల్వకుర్తి-885
కామారెడ్డి-1471
కరీంనగర్-897
ఖమ్మం-3484
ఖానాపూర్-2418
కోదాడ-456
కొడంగల్-1287
కొల్లాపూర్-1170
కోరుట్ల-2476
కొత్తగూడెం-1086
కూకట్‌పల్లి-1288
ఎల్బీనగర్-1121
మధిర-963
మహబూబాబాద్-3156
మహబూబ్‌నగర్-1275
మహేశ్వరం-1731
మక్తల్-2001
మలక్‌పేట్-498
మల్కాజిగిరి-1630
మానకొండూరు-2561
మంచిర్యాల-620
మంథని-2083
మెదక్-2125
మేడ్చల్-3399
మిర్యాలగూడ-27
ముదోల్-2058
ములుగు-3248
మునుగోడు-3071
ముషీరాబాద్-1320
నాగార్జునసాగర్-1320
నాగర్‌కర్నూలు-906
నకిరేకల్-1314
నల్గొండ-1201
నాంపల్లి-470
నారయణ్‌ఖేడ్-416
నారాయణపేట్-1813
నర్సంపేట్-2436
నర్సాపూర్-1580
నిర్మల్-1367
నిజామాబాద్ రూరల్-910
నిజామాబాద్ అర్బన్-562
పాలేరు-1271
పాలకుర్తి-822
పరిగి-89
పరకాల-2064
పటాన్‌చెరు-1334
పెద్దపల్లి-1801
పినపాక-868
కుత్బుల్లాపూర్-2220
రాజేంద్రనగర్-1265
రామగుండం-1078
సనత్‌నగర్-1464
సంగారెడ్డి-1390
సత్తుపల్లి-1664
సికింద్రాబాద్-1571
సికింద్రాబాద్- కంటోన్మెంట్-1471
శేరిలింగంపల్లి-1504
షాద్‌నగర్-1909
సిద్దిపేట-2932
సిరిసిల్ల-2321
సిర్పూర్-1579
సూర్యాపేట-572
తాండూర్-787
తుంగతుర్తి-910
ఉప్పల్-2333
వేములవాడ-1729
వికారాబాద్-1511
వనపర్తి-2014
వరంగల్ తూర్పు-2612
వరంగల్ పశ్చిమం-3075
వర్ధన్నపేట-5864(నోటాకు ఐదో స్థానం)
వైరా-2331
జహీరాబాద్-1714
యాకుత్‌పుర-773
ఇల్లందు-1910
ఎల్లారెడ్డి-2218





Untitled Document
Advertisements