తెలుగుదనం ఉట్టిపడుతున్న ఎన్టీఆర్ రెండో పాట

     Written by : smtv Desk | Wed, Dec 12, 2018, 11:42 AM

తెలుగుదనం ఉట్టిపడుతున్న ఎన్టీఆర్ రెండో పాట

హైదరాబాద్ ,డిసెంబర్ 12 :
తెలుగు జాతి ఇలవేల్పు అన్న " నందమూరి తారక రామారావు "గారి జీవిత చరిత్ర ని కదాంశం గా చేసుకుని నందమూరి బాలకృష్ణ కథనాయుకునిగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం " యన్ . టి . ఆర్ " . ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వొక గీతాన్ని విడుదల చెయ్యగా అద్బుతమయిన స్పందన వస్తుంది . కాగా ఈ రోజు రెండో గీతాన్ని విడుదల చేసారు .

జగద్గురు "ఆది శంకరాచార్యులు" రచించిన "నిర్వాణ షట్కమ్" లోని శ్లోకం తో మొదలయ్యే ఈ గీతానికి కే.శివదత్తా , కే.రామకృష్ణ , ఎం.ఎం.కీరవాణి సాహిత్యం అందించగా ఎం.ఎం.కీరవాణి స్వరపరచారు. తెలుగు చిత్ర అగ్ర కథనాయుకునిగా గా వెండి తెరపై వొక వెలుగు వెలిగి , దీన జనోద్ధారణకై రాజకీయాలోకి వచ్చిన యన్ .టి .ఆర్ అనే అర్ధం వచ్చే లాగా , అద్భుతమయిన పదకూర్పుతో వచ్చిన ఈ గీతాన్ని కాళ భైరవ ,మోహనా భోగ రాజు , శ్రీ నిధీ తిరుమల ,శరత్ సంతోష్ ల తో పాటు కీరవాణి గాత్రం అందించారు. నందమూరి హీరోలకి తెలుగు బాష మీద పట్టు , బాషాభిమానం వొకింత ఎక్కువనే చెప్పాలి ఆ విషయాన్ని ఈ లీరికల్ వీడియో ద్వారా మరొక సారి తెలియ చెప్పారు ఆది నుండి అంతం వరకు ప్రతి పదం తెలుగులోనే ఉండడం మనం గమనించవచ్చు.
అచ్చమయిన తెలుగు నుడికారం తో అద్భుతమయిన సంగీతంతో మొత్తం మీద పాట "నః భూతొ న భవిష్యత్ " అన్న విధంగా ఉంది.





Untitled Document
Advertisements