సంక్రాంతికివచ్చి మిమ్ముల్ని నవ్విస్తాంగా

     Written by : smtv Desk | Wed, Dec 12, 2018, 07:26 PM

సంక్రాంతికివచ్చి మిమ్ముల్ని నవ్విస్తాంగా

హైదరాబాద్ ,డిసెంబర్ 12 :
ఈ మధ్య తెలుగు చిత్ర సీమ లో ముల్టీస్టార్ర్ ల టైం నడుస్తుంది , వాటిలో భాగమయిన యఫ్ 2 టీజర్ ని ఈ రోజు సాయంత్రం విడుదల చేసారు . ఈ చిత్రానికి యువ కమర్షియల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా విక్టరీ వెంకటేష్ , మెగాహీరో వరుణ్ తేజ్ కథానాయకులు గా వారి సరసన తమ్మన్న ,మెహ్రయిన్ కథనాయికలుగా నటిస్తున్నారు. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

టీజర్ గురించి మాట్లాడుకుంటే 1:21 నిముషాల నిడివి ఉన్న టీజర్లో ఆద్యంతం సరదా సన్నివేశాలతో నింపేసాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి ,
మగవారి జీవితం పెళ్ళికి ముందు పెళ్లి తర్వాత అనే డైలాగ్ , పెళ్లి కి సంబంధించి వెంకీ ,వరుణ్ లు చెప్పే వొక డైలాగ్ ఆకర్షణగా ఉన్నాయి .చివర్లో సంక్రాంతికి నవ్విస్తాంగా అంటూ కంప్లీట్ అవ్వుద్ది. మొత్తం మీద పర్లేదు అన్నట్లుంది.





Untitled Document
Advertisements