నేడే ప్రమాణ స్వీకారం..!

     Written by : smtv Desk | Thu, Dec 13, 2018, 01:17 PM

నేడే ప్రమాణ స్వీకారం..!

హైదరాబాద్, డిసెంబర్ 13: నేడు మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో సీఎంగా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్న కేసీఆర్. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కేసీఆర్ స్థానిక ఎన్నికలపై దృష్టిని సారించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో తెరాస పార్టీని సుస్థిరం చేయాలంటే ఇదే మంచి సమయమని భావిస్తున్న ఆయన, మొత్తం పంచాయతీలనూ కైవసం చేసుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నారు. కెసిఆర్ తో పటు మరొక మంత్రి కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వ్యవధి తక్కువగా ఉండటంతోనే కేబినెట్‌లోకి మంత్రులను ఎవరినీ తీసుకోవద్దని నిర్ణయించినట్లు తెలిసింది.

స్థానిక ఎన్నికలు జరగాలంటే, ప్రభుత్వం ఉండటం తప్పనిసరి కావడంతో, నేటి ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చే పనిలో ప్రభుత్వం ఉండనుందని తెలుస్తోంది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గంలోని పంచాయతీలను కైవసం చేసుకునే దిశగా వాటి బాధ్యతలు సంబంధిత ఎమ్మెల్యేలపై ఉంచిన కేసీఆర్, వాటిని కూడా సొంత ఎన్నికలుగా భావించి పార్టీ శ్రేణులను గెలిపించేలా చూడాలని ఆదేశించారు.





Untitled Document
Advertisements