ప్రమాణ స్వీకారం చేసిన కెసిఆర్..!

     Written by : smtv Desk | Thu, Dec 13, 2018, 02:11 PM

 ప్రమాణ స్వీకారం చేసిన కెసిఆర్..!

హైదరాబాద్, డిసెంబర్ 13: ఈరోజు తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా తెరాస అధినేత కెసిఆర్ ప్రమాణస్వీకారం చేసారు. నిన్న టీఆర్ఎస్ఎల్పీగా ఏకగ్రీవంగా ఎంపికైన కెసిఆర్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసారు. కెసిఆర్ తో పాటు మరో మంత్రి మహమ్మద్ అలీ కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణ స్వీకారం అనంతరం పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్.

''కల్వకుంటల చంద్రశేఖర్ రావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణశుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాఘద్వేషాలు గాని లేకుండ రాజ్యాంగాన్నిశాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.''.. ''కల్వకుంటల చంద్రశేఖర్ రావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియ వచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకుతప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యకికి లేదా వ్యక్తులకు తెలియపరచునని లేదా వెల్లడించాను అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.'' కెసిఆర్ ప్రమాణస్వీకారం అనంతరం రాజ్ భవన్ లో జై కెసిఆర్, జై తెలంగాణ అని నినాదాలు చేసారు.





Untitled Document
Advertisements