అన్నదమ్ముల హ్యాట్రిక్.!

     Written by : smtv Desk | Thu, Dec 13, 2018, 05:18 PM

అన్నదమ్ముల హ్యాట్రిక్.!

ఖమ్మం, డిసెంబర్ 13: వారు ఇరువురు అన్నదమ్ములు,తెలంగాణ ఎన్నికల్లో ఇద్దరు హ్యాట్రిక్ సాధించారు. కాకపోతే గెలుపులో ఒకరు హ్యాట్రిక్‌ సాధిస్తే ఓటమిలో మరొకరు హ్యాట్రిక్‌ కొట్టారు. వారు ఎవరో కాదు ఖమ్మం జిల్లా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామానికి చెందిన డాక్టర్‌ మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్కలు. అన్న డాక్టర్‌ రవి ఓటమిలో హ్యాట్రిక్‌ కొట్టగా, తమ్ముడు భట్టి విక్రమార్క విజయంలో హ్యాట్రిక్‌ కొట్టారు. మధిర నియోజకవర్గంలో 2009, 2014, 2018 ఎన్నికల్లో భట్టి విక్రమార్క విజయభేరి మోగించగ అన్న అయిన రవికి ఇప్పటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఒకసారి మాత్రమే విజయం సాధించారు.

దివంగత వైఎస్సార్‌ సీఎంగా ఉన్నపుడు జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందారు. తర్వాత 2009, 2014, ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో జడ్చర్ల నుంచి పోటీ చేసి వరుసగా ఓటమిపాలయ్యారు. ఆయన 1991, 1998లో లోక్‌సభ సభ్యుడిగా నాగర్‌కర్నూల్‌ నుంచి ఎన్నికయ్యారు.





Untitled Document
Advertisements