బాహుబలి కాంబినేషన్ మళ్ళీ రిపీట్

     Written by : smtv Desk | Sat, Dec 15, 2018, 10:35 AM

బాహుబలి కాంబినేషన్ మళ్ళీ రిపీట్

హైదరాబాద్ డిసెంబర్ 15 : ప్రభాస్ , , అనుష్క ఇద్దరూ మిర్చి .. బిల్లా సినిమాల్లో జంటగా నటించారు . ఆ తరువాత వచ్చిన బాహుబలి తో ఈ కాంబినేషన్ కి మంచి మార్కులు పడ్డాయి . ఆ క్రమం లోనే వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారని వార్తలొచ్చాయి అంతగా వాళ్ళ మధ్య కెమిస్ట్రీ కుదిరింది . ఈ జంటను మళ్లీ తెరపై చూడటానికి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు . వాళ్ళ ముచ్చట తీర్చడం కోసమేనన్నట్టుగా ఈ ఇద్దరూ మరోసారి జోడీ కడుతున్నారు.

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వొక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో వొక కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలో కీలకమైన మరో హీరోయిన్ పాత్ర కి అనుష్క ని ఎంపిక చేసుకున్నారట .దింతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి .





Untitled Document
Advertisements