జాతిపితను అవమానించిన ఆఫ్రికన్స్

     Written by : smtv Desk | Mon, Dec 17, 2018, 03:29 PM

జాతిపితను అవమానించిన ఆఫ్రికన్స్

ఘనా, డిసెంబర్ 17: జాతిపిత మహాత్మా గాంధీ, వొక దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన వీరుడి పై ఆఫ్రికా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆఫ్రికా దేశం అయిన ఘనాలో గాంధీ పేరు చెబితేనే అక్కడి వారు మండిపడుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ ఘనా ఏకంగా తమ క్యాంపస్‌‌లో ఏర్పాటు చేసిన గాందీ విగ్రహాన్ని తీసేసింది. వొకమాటలో చెప్పాలంటే కూల్చేసింది. ఇందుకు కారణం కూడా వారు చెబుతున్నారు.

గాంధీ నల్లజాతీయులపై చిన్నచూపు చూశారని ఆరోపిస్తున్నారు. దక్షిణాఫ్రికాలో గాంధీ ఉన్నసమయంలో నాడు ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్న నల్లజాతీయులపై వివక్ష చూపించారని ఆరోపించారు. నల్లజాతీయులను గాంధీ వొక అనాగరికత మనుష్యులుగా చూసేవారని చెప్పడమే కాదు శ్వేత జాతీయులకే దక్షిణాఫ్రికాలో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కొన్నిచోట్ల రాశారని చెప్పారు.





Untitled Document
Advertisements