అమెరికాలో బయటపడ్డ మరో భారీ 'వజ్రం'

     Written by : smtv Desk | Tue, Dec 18, 2018, 11:42 AM

అమెరికాలో బయటపడ్డ మరో భారీ 'వజ్రం'

అమెరికా, డిసెంబర్ 18: ఉత్తర అమెరికా డైవిక్ డైమండ్ గనుల్లో మరో అత్యంత అరుదైన, నాణ్యమైన డైమండ్ బయటపడింది. ఇది ప్రపంచంలోనే అత్యనంత అరుదైన, అతి పెద్ద డైమండ్ గా చెప్తున్నారు. ఈ వజ్రం నాణ్యత 552 క్యారెట్లు. ఇంత నాణ్యమైన వజ్రం ఇప్పటి వరకు లభించలేదు. గతంలో లభించిన వాటిలో అత్యంత నాణ్యమైన వజ్రం 187 క్యారెట్లు. ప్రస్తుతం బయటపడ్డ 552 క్యారెట్ల వజ్రం ఎల్లో రంగులో ఉంది. కోడి గుడ్డు సైజులో ఉంది. ఈ వజ్రాన్ని ఇప్పుడే విక్రయించబోమని గనుల యజమాని చెప్పారు.
వజ్రాన్ని సరైన ఆకృతిలో కట్‌ చేసి. పాలిష్ చేసిన తర్వాత విక్రయిస్తామని చెప్పారు. అతి భారీ వజ్రంగా భావిస్తున్న దీని విలువ కూడా రికార్డు స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నారు.
అయితే దీన్ని ఖచ్చితమైన ధరను ఇప్పుడే చెప్పలేమని. మెరుగులు దిద్దిన తర్వాత ఒక అంచనాకు రావొచ్చు అని వజ్రవ్యాపార నిపుణులు చెబుతున్నారు.
మన దేశం నుంచి ఇంగ్లండ్‌ తరలిపోయిన కొహినూర్ డైమండ్‌ 105.6 క్యారెట్లు.





Untitled Document
Advertisements