అందవికారంగా మారుతున్న 'శని' గ్రహం

     Written by : smtv Desk | Tue, Dec 18, 2018, 03:33 PM

అందవికారంగా మారుతున్న 'శని' గ్రహం

హూస్టన్, డిసెంబర్ 18: సౌర కుటుంబంలోని గ్రహలన్నింటిలో వింతగా కనిపించే గ్రహం 'శని' . తన చుట్టూ ఉండే రింగ్స్‌తో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. అయితే ఇప్పుడా వలయాలు మాయమైపోతున్నాయని నాసా సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శని గ్రహం అయస్కాంత క్షేత్ర ప్రభావంతో ఈ వలయాలు క్రమంగా మంచు అణువులతో కూడిన వర్షంలాగా కురుస్తూ కరిగిపోతున్నాయని సైంటిస్టులు వెల్లడించారు. ఇదిలాగే కొనసాగితే వచ్చే పది కోట్ల సంవత్సరాల్లో అసలు రింగులు కనిపించకుండాపోతాయని వాళ్లు అంచనా వేశారు. వొలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్ అరగంటలో నిండిపోయే స్థాయిలో ఈ వలయాలు కరిగిపోతున్నాయని నాసా గొడార్డ్ స్పేస్ ైఫ్లెట్ సెంటర్ సైంటిస్ట్ ఓడొనోగ్ చెప్పారు. నాసా పంపిన కాసిని ఎయిర్‌క్రాఫ్ట్ రింగుల గురించి ఆసక్తికరమైన విషయాలను భూమికి పంపించింది.

ఈ వలయాలు పది కోట్ల ఏళ్ల కంటే ఎక్కువగా ఉండేలా లేవని ఆయన తెలిపారు. ఈ అధ్యయన అంశాలను ఇకారస్ జర్నల్‌లో ప్రచురించారు. శని గ్రహం 400 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడింది. ఈ లెక్కన చూసుకుంటే 10 కోట్ల సంత్సరాలు చాలా తక్కువ సమయమే అని ఓడొనోగ్ అన్నారు. శనిగ్రహం ఈ వలయాలతోనే ఏర్పడిందా లేక మధ్యలో అవి ఏర్పడ్డాయా అన్నదానిపై సైంటిస్టులకే ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే తాజాగా వచ్చిన ఓ అధ్యయన ఫలితాల ప్రకారం చూస్తే ఇవి పది కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడినట్లు తేలింది. శని గ్రహం చుట్టూ తిరిగే కొన్ని మంచుతో కూడిన ఉపగ్రహాలు ఢీకొనడం వల్ల ఈ వలయాలు ఏర్పడినట్లు అంచనా వేస్తున్నారు. అందువల్ల ఈ వలయాల్లో మంచు మాత్రమే ఉంటుంది.





Untitled Document
Advertisements