అసెంబ్లీలో చేయాల్సిందేంటి...? వీరు చేస్తుందేంటి...!

     Written by : smtv Desk | Tue, Dec 18, 2018, 05:29 PM

అసెంబ్లీలో చేయాల్సిందేంటి...? వీరు చేస్తుందేంటి...!

కర్ణాటక, డిసెంబర్ 18: ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే దేవాలయం లాగ పిలువబడే అసెంబ్లీ లో గతంలో కొందరు శాసనసభ్యులు అసెంబ్లీ లోపల ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండడంతో కర్ణాటక స్పీకర్ అసెంబ్లీ హాల్ లోపలికి స్మార్ట్ ఫోన్ తీసుకుని రావడాన్ని నిషేదించారు. తాజాగా బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యే ఎన్.మహేష్ హాల్ లోపలికి స్మార్ట్ ఫోన్ తీసుకుని పోవడమే కాకుండా అందులో అమ్మాయిల ఫోటోలు చూస్తూ కెమెరాకు చిక్కారు.

ఈ విషయం గురించి మీడియా ఆయనను ప్రశ్నించగా రివర్సుగా మీడియా పైనే దురుసుగా ప్రవర్తించారు. ప్రతీ చిన్న విషయాన్నీ సెన్సేషన్ చేయడం మీడియా వారికి అలవాటు అయిందంటూ ఆరోపించారు. దీంతో మీడియా ఆగ్రహించడంతో వారికి క్షమాపణలు చెప్పి, నిషేధం ఉన్నా కూడా హాల్‌లోకి ఫోన్ తీసుకుని పోయాను తప్పయింది. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి పని చేయనని తెలిపారు. అమ్మాయిల ఫోటోల గురించి ఆరా తీయగా మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. మా స్నేహితుడు కొందరు అమ్మాయిల ఫోటోలు పంపిస్తే చూశానంటూ బదులిచ్చారు





Untitled Document
Advertisements