వాషింగ్టన్, డిసెంబర్ 20: డోనాల్డ్ ట్రంప్ అగ్ర రాజ్యమైన అమెరికా అధ్యక్షుడు సిరియా నుంచి తమ దేశ సైనిక దళాలు ఉపసంహరణ కోసం ఆదేశాలు ఇచ్చారు. పెంటగాన్ ఈ నిర్ణయాన్ని వెల్లడించిన అనంతరం వైట్‌హౌజ్ దీన్ని దృవీకరించింది. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఓడిపోయారని, సిరియాలో ఉన్న రెండు వేల సైనికులు వెనక్కి రావాలని ట్రంప్ తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే ట్రంప్ నిర్ణయంపై కొందరు రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయిదేళ్ల క్రితం ఐసిఎస్ అత్యంత శక్తివంతంగా, ప్రమాదకరంగా ఉండేదని, అమెరికా దళాలు ఆ దుష్టశక్తిని నాశనం చేశాయని వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వొక ప్రకటనలో తెలిపారు. దీనికి సంబంధించి ట్రంప్ ఓ ట్వీట్ కూడా చేశారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వాగతించారు. ట్రంప్ సరైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.
After historic victories against ISIS, it’s time to bring our great young people home! pic.twitter.com/xoNjFzQFTp
— Donald J. Trump (@realDonaldTrump) December 19, 2018
....Russia, Iran, Syria & many others are not happy about the U.S. leaving, despite what the Fake News says, because now they will have to fight ISIS and others, who they hate, without us. I am building by far the most powerful military in the world. ISIS hits us they are doomed!
— Donald J. Trump (@realDonaldTrump) December 20, 2018