ఐపీఎల్‌ 2019 : ఎవరి ధర ఎంత ?

     Written by : smtv Desk | Fri, Dec 21, 2018, 12:16 PM

ఐపీఎల్‌ 2019 : ఎవరి ధర ఎంత ?

డిసెంబర్ 21: 2019 ఐపీఎల్ కోసం వేలం కొనసాగుతోంది... తొలిరౌండ్ వేలం ముగిసేసరికి పేసర్‌ ఉనాద్కట్‌ను రూ. 8.4 కోట్ల అత్యధిక ధరతో రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. తరువాత వెస్టిండీస్ ఆటగాడు బ్రాత్‌వైట్‌ను రూ.5కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది. మోహిత్ శర్మను రూ. 5 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. షమీని రూ. 4.8 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయగా.. విండీస్ కీపర్ నికోలస్ పూరన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.4.20 కోట్లకు దక్కించుకుంది. వెస్టిండీస్ జట్టుకు చెందిన మరో ఆటగాడు హెట్‌మైర్‌ను రూ.4.2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది.

మలింగను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు, ఇషాంత్ శర్మను రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి. ఢిల్లీ జట్టు అక్సర్ పటేల్‌ను రూ.5కోట్లకు, హనుమ విహారిని రూ.2కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను హైదరాబాద్ జట్టు రూ.2.2కోట్లకు దక్కించుకుంది. వికెట్ కీపర్ సాహాను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. హెన్రిక్స్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.కోటికి కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఐపీఎల్ 2019 వేలం పాట కొనసాగుతోంది.





Untitled Document
Advertisements