శాంతాక్లాజ్‌ వేషంలో బరాక్‌ ఒబామా.!

     Written by : smtv Desk | Fri, Dec 21, 2018, 01:45 PM

శాంతాక్లాజ్‌ వేషంలో బరాక్‌ ఒబామా.!

అమెరికా, డిసెంబర్ 21: అమెరికా సంయుక్త రాష్ట్రాల మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సామాజిక కార్యకలాపాల్లో చాలా చురుకుగా ఉంటారు. సామాజిక సమస్యల పట్ల కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి అవగాహన కల్పిస్తూ ఉంటారు. క్రిస్మస్‌ సమీపిస్తుండటంతో శాంతాక్లాజ్‌ వేషధారణలో వాషింగ్టన్‌లోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రికి వెళ్లి అక్కడి పిల్లలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. శాంతాక్లాజ్‌ టోపి పెట్టుకుని పిల్లలకు క్రిస్మన్‌ కానుకలు ఇచ్చి కాసేపు వారితో ఆట, పాటలాడారు.


కానుకల సంచిని భుజాన వేసుకుని ఒబామా నడుచుకుంటూ వస్తున్న ఫొటో ఒకటి ఇపుడు నెట్ లో వైరల్‌ అవుతోంది. అద్భుతమైన, అందమైన పిల్లలతో ఆడుకునే అవకాశం కల్పించిన ఆసుపత్రికి యాజమాన్యానికి ధన్యవాదాలు. వాళ్ళు ఎప్పుడూ ఇలాగే నవ్వుతు ఉండాలి అని ఒబామా చెప్పుకొచ్చారు. పిల్లల పట్ల ఒబామా చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోయి మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.





Untitled Document
Advertisements