నాలుగవ టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరం

     Written by : smtv Desk | Mon, Dec 31, 2018, 12:55 PM

నాలుగవ టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరం

హైదరాబాద్, డిసెంబర్ 31: టీం ఇండియా ఆటగాడు రోహిత్ శర్మ తండ్రి అయ్యారు. రోహిత్ భార్య రితిక సజదేహ నిన్న ముంబయిలో పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్నీ రితిక కజిన్ సీమ ఖాన్ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్‌లో తెలిపింది. దీంతో రోహిత్ శర్మ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగవ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం లేదట. రోహిత్ తన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టంలో భార్యకు తోడుగా ఉండడానికి ఆస్ట్రేలియా నుంచి ముంబయి వచ్చారు. ఇటీవల ఆస్ట్రేలియా ప్లేయర్ మైఖేల్ క్లార్క్‌తో జరిగిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు… నేను తండ్రి ఎప్ప్పుడు అవుతానా అని వేచి ఉన్నానని, ఇది మా జీవితాల్లో గేమ్ ఛంజింగ్ మూమెంట్ అని, నేను తండ్రి అయ్యే క్షణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న, అది నా జీవితాన్ని మార్చివేసే సమయం అవుతుందని తెలిపారు.





Untitled Document
Advertisements