సంక్రాంతి బరిలో 'విశ్వాసం'..

     Written by : smtv Desk | Fri, Jan 04, 2019, 05:16 PM

సంక్రాంతి బరిలో 'విశ్వాసం'..

చెన్నై, జనవరి 4: సంక్రాంతి వచ్చింది అంటే సినిమాల సందడి ఉండాల్సిందే. సంక్రాంతి పందెం కోళ్లుగా తమ సత్తా చాటేందుకు హీరోలు పోటీపడుతుంటారు. తమిళనాడులో అజిత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. మాస్ ఆడియన్స్ లో ఆయనకి ఏ స్థాయి ఇమేజ్ ఉందో .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను అదే స్థాయి ఇమేజ్ ఉండటం విశేషం. అందువల్లనే ఆయన హిట్ చిత్రాల జాబితాలో ఎక్కువ సినిమాలు కనిపిస్తాయి. ఆయన హీరోగా శివ దర్శకత్వంలో రూపొందిన 'విశ్వాసం' చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని 'యు' సర్టిఫికేట్ ను తెచ్చుకొని సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమైపోతోంది.

జనవరి 10వ తేదీన ఈ సినిమాను అత్యధిక థియేటర్లలో విడుదల చేస్తున్నారు. నయనతార కథానాయిక కావడం ఈ సినిమాపై అంచనాలను మరింతగా పెంచుతోంది. ఇదే రోజున తమిళంలో సూపర్ స్టార్ రజనీ కాంత్ మూవీ 'పేట్ట' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుండటంతో, అంచనాలు భారీగానే వున్నాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్లకు వస్తుండటంతో తమిళ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.





Untitled Document
Advertisements