'ఎన్టీఆర్'లో బాలకృష్ణ పాత్ర లేదు: కల్యాణ్ రామ్

     Written by : smtv Desk | Fri, Jan 04, 2019, 07:57 PM

'ఎన్టీఆర్'లో బాలకృష్ణ పాత్ర లేదు: కల్యాణ్ రామ్

హైదరాబాద్, జనవరి 4: నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా యన్.టి.ఆర్ చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 9న 'కథానాయకుడు' రిలీజ్ కాబోతోంది. రెండో భాగం ఫిబ్రవరి 7న విడుదలకానుంది. 'ఎన్టీఆర్' బయోపిక్ లో ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ పాత్రను పోషించేది ఎవరు? చాలాకాలంగా సస్పెన్స్ లో ఉన్న ఈ విషయంలో అసలు విషయాన్ని చెప్పేశాడు కల్యాణ్ రామ్. సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్యాణ్ రామ్, సినిమాలో అసలు బాబాయి పాత్ర లేదని అన్నాడు.

ఈ సినిమాలో చైతన్యరధ సారథి హరికృష్ణ పాత్రను పోషించిన కల్యాణ్ రామ్, తన తండ్రి పాత్రను తాను పోషించే అవకాశం లభించడం తమకెంతో గర్వకారణమని అన్నాడు. ఈ చిత్రంలో తన ఫోటో కనిపించినా చాలని భావించానని, అటువంటిది తన తండ్రి పాత్రే దక్కిందని ఆనందాన్ని వ్యక్తం చేసిన కల్యాణ్ రామ్, తన తండ్రి ఆ గెటప్ ను చూసివున్నా బాగుండేదని, ఇప్పుడాయన మన మధ్య లేకపోయారని అన్నాడు. ఇక సినిమాలో బాబాయ్ (బాలకృష్ణ) తరువాత చక్కగా కుదిరిన పాత్ర సుమంత్ దేనని, ఆయన అక్కినేని నాగేశ్వరరావుగా చక్కగా కుదిరారని, ఆపై చంద్రబాబు పాత్రలో రానా కూడా బాగున్నారని చెప్పాడు.

ఈ చిత్రంలో రానా, సుమంత్, కల్యాణ్ రామ్, విద్యాబాలన్, రకుల్ ప్రీతి సింగ్, నిత్యామీనన్, హన్సిక ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. బాలకృష్ణ 63 గెటప్స్ లో కనిపించనుండటం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.





Untitled Document
Advertisements