చరణ్ సీక్రెట్ బయటపెట్టిన కైరా..

     Written by : smtv Desk | Sat, Jan 05, 2019, 01:30 PM

చరణ్ సీక్రెట్ బయటపెట్టిన కైరా..

హైదరాబాద్, జనవరి 5: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన 'వినయ విధేయ రామ' సినిమాలో కైరా అద్వాని కథానాయికగా నటించింది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో కైరా అద్వాని బిజీగా కింది. తాజా ఇంటర్వ్యూలో చరణ్ కి సంబంధించిన ఒక సీక్రెట్ ను సరదాగా ఆమె బయటపెట్టింది.

రామ్ చరణ్ కి ఫేస్ బుక్ లో మాత్రమే ఎకౌంట్ వుంది. ఇంస్టా గ్రామ్, ట్విట్టర్ లు చరణ్ వాడడు. అయితే ఈ విషయాన్ని గురించి కైరా మాట్లాడుతూ .. "సీక్రెట్ ఎకౌంట్ ద్వారా చరణ్ ఇంస్టా గ్రామ్ లో అప్ డేట్స్ చూస్తుంటాడు. ఇంస్టా గ్రామ్ లో ఎక్కువ సమయం గడపడం అంటే చరణ్ కి చాలా ఇష్టం. అయితే ఈ విషయం ఎవరికీ తెలియకుండా ఆయన జాగ్రత్త పడుతుంటాడు" చరణ్ సీక్రేట్ ని బయటపెట్టింది. దాంతో ఆయన ఇంస్టా గ్రామ్ అకౌంట్ తెలుసుకోవడం కోసం అభిమానులు రంగంలోకి దిగిపోయారు.





Untitled Document
Advertisements