సిరీస్ గెలిచిన టీం ఇండియా

     Written by : smtv Desk | Tue, Jan 08, 2019, 11:34 AM

సిరీస్ గెలిచిన టీం ఇండియా

సిడ్నీ, జనవరి 8: గావస్కర్‌ - బోర్డర్‌ సిరీస్‌ ని గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టు. తన టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలిసారి ఆస్ట్రేలియాలో సిరీస్‌ గెలిచిన టీం ఇండియా కొత్త చరిత్ర సృష్టించింది. విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టు ఈ విజయాన్ని సాధించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన చివరి టెస్టు డ్రాగా ముగియడంతో గావస్కర్‌ - బోర్డర్‌ సిరీస్‌ను భారత్‌ 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా 72 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని, గతంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను కోహ్లి సేన సాకారం చేసింది. ఈ సిరీస్ లో తొలిసారి పుజారా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు గెల్చుకున్నాడు.

అంతకముందు అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో 31 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించగా, పెర్త్‌లో జరిగిన రెండో టెస్టులో ఆసీస్‌ 146 పరుగుల తేడాతో గెలుపును అందుకుంది. ఆపై మెల్‌ బోర్న్‌ టెస్ట్‌లో 137 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించి ఆధిక్యంలో నిలిచింది. ఈ సిరీస్‌లో చతేశ్వర్‌ పుజారా 521 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, బౌలింగ్‌ విభాగంలో బుమ్రా (21 వికెట్లు) అగ్రస్థానంలో నిలిచాడు. ఇక మహ్మద్‌ షమీ 16 వికెట్లు, ఇషాంత్‌ శర్మ 11 వికెట్లు తీశారు.

ఈ సిరీస్ లో తొలిసారి పుజారా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌’ అవార్డు గెల్చుకున్నాడు.

జనవరి 12 నుండి ఆసీస్‌ జరిగే వన్ డే సిరీస్ కోసం భరత్ సిద్ధంగా ఉంది.





Untitled Document
Advertisements