అమెరికాలో 'శాతకర్ణి' రికార్డు బద్దలు కొట్టిన 'కథానాయకుడు'..

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 12:21 PM

అమెరికాలో 'శాతకర్ణి' రికార్డు బద్దలు కొట్టిన 'కథానాయకుడు'..

హైదరాబాద్, జనవరి 9: నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో దివంగత ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం యన్.టి.ఆర్. ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈరోజు 'కథానాయకుడు' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సినీ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది.

అయితే అమెరికాలో నిన్ననే ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ ఉదయం వరకు వేసిన షోలతో ఈ చిత్రం 4,40,000 డాలర్లను (రూ. 3,09,87,000) వసూలుచేసింది. ఈ క్రమంలో బాలయ్య గత చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' రికార్డును బద్దలు కొట్టింది. 'శాతకర్ణి' సినిమా ప్రీమియర్ షో ద్వారా తొలి రోజు రూ. 3,75,000 డాలర్లు (రూ. 2,64,14,812) వసూలు చేసింది. ఆ రికార్డును 'కథానాయకుడు' అధిగమించింది.





Untitled Document
Advertisements