ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ ధర రూ.899 మాత్రమే

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 04:56 PM

ఇండిగో ఎయిర్‌లైన్స్ టికెట్ ధర రూ.899 మాత్రమే

జనవరి 9: ఇండిగో ఎయిర్‌లైన్స్ మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. డొమెస్టిక్ ప్రయాణికులకు రూ.899, అంతర్జాతీయ ప్రయాణికులకు రూ.3,399 టికెట్ ధరను ఆఫర్ చేస్తోంది. జనవరి 25 నుంచి ఏప్రిల్ 15 మధ్య ప్రయాణించాలనుకునేవాళ్లు జనవరి 9 నుంచి జనవరి 13 మధ్య బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ సమయంలో అన్ని ఫ్లైట్ బుకింగ్స్‌పై ఇవే ధరలకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తక్కువ ధరకు టికెట్లు ఆఫర్ చేయడం మాత్రమే కాదు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా ఆన్‌లైన్ పేమెంట్స్ చేస్తే రూ.500 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఈ ఆఫర్‌ను ఒక యూజర్ ఒకసారి మాత్రమే ఉపయోగించుకోవచ్చు. కేవలం నాన్-స్టాప్ ఫ్లైట్లకు మాత్రమే ఆఫర్ వర్తిస్తుంది. ఒకవేళ కనెక్టింగ్ ఫ్లైట్లు బుక్ చేసుకోవాలనుకుంటే ఈ ఆఫర్ ఉండదు. ఇప్పటికే జెట్ ఎయిర్‌ వేస్, ఎయిర్ ఏషియా కూడా ఆఫర్ సేల్ ప్రకటించాయి. జెట్ ఎయిర్‌వేస్ గ్లోబల్ సేల్ జనవరి 11 వరకు, ఎయిర్ ఏసియా సేల్ జనవరి 20 వరకు కొనసాగనుంది.







Untitled Document
Advertisements