పచ్చిబఠానీల వల్ల ప్రయోజనాలు

     Written by : smtv Desk | Wed, Jan 09, 2019, 06:26 PM

పచ్చిబఠానీల వల్ల ప్రయోజనాలు

చలి కాలంలో వేడి వేడిగా పచ్చి బఠానీలు తింటుంటే వచ్చే మజాయే వేరు కదా. పచ్చి బఠానీలను చాలా మంది వంటల్లో వేస్తుంటారు. కొందరు వీటిని తినేందుకు ఇష్టపడరు. కానీ నిజానికి పచ్చి బఠానీలు ప్రోటీన్లకు పెట్టింది పేరు. అలాగే ఇతర అనేక ముఖ్యమైన పోషకాలు కూడా పచ్చి బఠానీల్లో ఉంటాయి. ఈ క్రమంలోనే పచ్చి బఠానీలను తరచూ మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటితో మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పచ్చి బఠానీల్లో ఫైబర్ ఉంటుంది. అందువల్ల ఒక కప్పు ఉడకబెట్టిన పచ్చి బఠానీలను తింటే అంత త్వరగా ఆకలి కాదు. దీని వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. ఫలితంగా అధిక బరువు త్వరగా తగ్గుతారు. దీనికి తోడు పచ్చి బఠానీల వల్ల క్యాలరీలు కూడా చాలా తక్కువగా లభిస్తాయి. బరువు నియంత్రణలో ఉంటుంది.

2. పచ్చి బఠానీల్లో విటమిన్ ఎ, బి1, బి2, సి, ఐరన్, కాల్షియం, పాస్ఫరస్‌లు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నేత్ర సమస్యలు, రక్తహీనత ఉండవు. ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా ఉంటారు.

3. ఎదిగే పిల్లలకు పచ్చి బఠానీలను పెట్టాలి. ఇవి వారికి బలవర్దకమైన ఆహారంగా పనిచేస్తాయి.

4. పచ్చి బఠానీల్లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. అయితే వీటిని అతిగా మాత్రం తినరాదు. తింటే గ్యాస్ ఇబ్బంది పెడుతుంది.





Untitled Document
Advertisements