ధోని ఎప్పుడూ కీలకమే...!!!

     Written by : smtv Desk | Fri, Jan 11, 2019, 04:12 PM

ధోని ఎప్పుడూ కీలకమే...!!!

సిడ్నీ, జనవరి 11: ప్రస్తుతం ఉన్న వన్డే భారత క్రికెట్ జట్టు మంచి ప్రదర్శన చూపిస్తున్నందుకు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో తలపడనున్న సిరీస్ లో పెద్దగా మార్పులు ఉండవని టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. అంతేకాకుండా ప్రపంచకప్ లో కూడా ఒకటి, రెండు మార్పులే ఉంటాయి అని గురువారం మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం ఇండియా రానున్న 13 వన్డేలలో ఆడనుంది, అందులో ఆడే జట్టే వరల్డ్ కప్ కి ఆడుతుంది అన్నారు.

తీరిక లేకుండా సిరీస్ ఆడుతున్నాం కాబ్బటి ఆటతీరుతో చిన్నచిన్న లోపాలు ఉండొచ్చు అని అంటున్నారు. ఇది వ్యక్తిగత క్రీడ, 11 మంది అందరు మంచి ప్రదర్శన ఇస్తేనే కప్ గెలవగలం. జట్టును ఒడ్డున పడేసేందుకు అవసరమైతే సవాళ్లను స్వీకరించేందుకు నేనున్నానంటూ ముందుకురావాలి. ధోని ఎప్పుడూ కీలకమే. బ్యాటింగ్, బౌలింగ్‌ లో ఆల్‌రౌండ్‌ర్లు పాండ్యా, జడేజా, కేదార్‌ జాదవ్‌ సమతూకం తెచ్చారు.

వన్డేల్లో ఆసీస్‌ను తక్కువ అంచనా వేయరాదని భారత వైస్‌ కెప్టెన్‌ అభిప్రాయపడ్డాడు. ‘ప్రధాన పేసర్లు లేకుండానే ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ ఆడనున్నా, మమ్మల్ని ఇబ్బందిపెట్టగల బౌలర్లు ఇంకా వారికున్నారు. 2016లో స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్‌ లేకున్నా మేం 1–4తో ఓడిపోయాం. ఈసారి కూడా అంతే. పరిస్థితులను అర్థం చేసుకుని ఆడితే మేం వారిని ఒత్తిడిలోకి నెట్టగలం’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

ఆస్ట్రేలియా జట్టు ముదురు పసుపు రంగు జెర్సీలతో బరిలోకి దిగబోతోంది. వన్డేల్లో రంగుల దుస్తులు వచ్చిన కొత్తలో 1986లో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన డ్రెస్‌ తరహాలోనే, సరిగ్గా అదే రంగుతో ఆసీస్‌ కిట్‌లు సిద్ధమయ్యాయి. మరో వైపు అనారోగ్యం కారణంగా మిషెల్‌ మార్ష్‌ తొలి వన్డేకు దూరమయ్యాడు. అతని స్థానంలో ఆస్టన్‌ టర్నర్‌ను ఎంపిక చేశారు.





Untitled Document
Advertisements