ఆటో డ్రైవర్ గా మారిన ముఖ్యమంత్రి

     Written by : smtv Desk | Sat, Feb 02, 2019, 02:28 PM

ఆటో డ్రైవర్ గా మారిన ముఖ్యమంత్రి

అమరావతి, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో డ్రైవర్ గా మారాడు. ఆటోలపై జీవితకాలం పన్ను రద్దు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపేందుకు ఆటో డ్రైవర్లు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తన జీవితానికి ఆటో డ్రైవర్ల జీవితానికి ఎనో దగ్గర పోలికలు ఉన్నాయన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని డ్రైవర్లు పోషిస్తుంటే రాష్ట్రాన్ని నడుపుతూ ప్రజల సంక్షేమాన్ని తాను చూస్తున్నానని చంద్రబాబు తెలిపారు.

అంతేకాకుండా ట్యాక్స్ రద్దు ఆరంభం మాత్రమే అని, ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఇంకా ఎన్నో చేస్తానని అన్నారు. రూ.140 కోట్ల నష్టం వస్తుందని చెప్పినా... ఆటో డ్రైవర్లకు భారం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక కష్టాలు ఉన్నా ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నానని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో అన్నీ ఎలక్ట్రికల్ వాహనాలే ఉంటాయన్నారు. ఇంధన ఛార్జీలు, ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించేలా చర్యలు తీసుకుంటామని సీఎం వెల్లడించారు. అనంతరం ఆటో డ్రైవర్‌ చొక్కా ధరించి తన నివాస ప్రాంగణం లో స్వయంగా ఆటో నడిపారు.





Untitled Document
Advertisements