సాగు భూమికే 'కిసాన్ సమ్మాన్ నిధి'

     Written by : smtv Desk | Sat, Feb 02, 2019, 08:23 PM

సాగు భూమికే 'కిసాన్ సమ్మాన్ నిధి'

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌ లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం గందరగోళం నెలకొంది. శుక్రవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో కొత్తగా ప్రవేశపెట్టిన కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఐదు ఎకరాలలోపు భూమి ఉండే అభ్యర్థులకు 6000 రూపాయలు నేరుగా రైతు ఖాతాలో పడుతుందని తెలిపారు. అయితే ఇది కేవలం సాగులో ఉన్న భూమికే వర్తిస్తుందని సూచించారు. దీంతో రైతులు డీలా పడ్డారు. భూమి ఉన్నంత మాత్రాన ఈ పథకం వర్తించదని తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో రైతు బంధు పథకం మాత్రం రైతులు భూమి ఉంటే చాలు పంట పెట్టుబడి సాయం ఇస్తున్నారు. కేంద్రం అందుకు విరుద్ధంగా ప్రకటించిందని అనే అభిప్రాయం రైతుల్లో ఉంది. ఈ విషయాన్ని రైతు ఉద్యమ నేత, స్వరాజ్ ఇండియా జాతీయ అధ్యక్షులు, యోగేంద్ర యాదవ్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధిపై బడ్జెట్ పేపర్లో వొక విధంగా, మంత్రి స్వీచ్ లో మరోక విధంగా ప్రకటించాటాన్ని ఆయన ప్రశ్నించారు. 2హెక్టార్ల భూమి అని ప్రసంగంలో చెప్పి, ఇప్పుడు పేపర్లలో మాత్రం వ్యవసాయ భూమి 2హెక్టార్లుగా మార్చడమేంటి అని ప్రశ్నించారు. ఇందులో ఏది సరైందని ప్రభుత్వం స్పష్టం చేయాలని యోగేంద్ర యాదవ్ ట్వీట్ లో డిమాండ్ చేశారు.





Untitled Document
Advertisements