ఇప్పటి వరకు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తా: విజయ్ మాల్యా

     Written by : smtv Desk | Wed, Feb 06, 2019, 12:33 PM

ఇప్పటి వరకు వెళ్ళలేదు ఇప్పుడు వెళ్తా: విజయ్ మాల్యా

న్యూఢిల్లీ , ఫిబ్రవరి 06: ఆర్థిక నేరస్తుడు విజయ్‌మాల్యాను భారత్‌కు పంపాలని బ్రిటన్ తీసుకున్న నిర్ణయం వెలువడిన కొద్ది గంటల్లోనే మాల్యా స్పందించారు. బ్రిటన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తానని అతను వెల్లడించారు. భారత్‌లోని కోర్టులకు విజయ్ మాల్యా సమాధానం చెప్పాల్సి ఉందని భావించింది లండన్‌లోని వెస్ట్‌మిన్స్‌టర్ మెజిస్ట్రేట్ కోర్టు.

డిసెంబర్ 10 వతేదీన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం పై నిర్ణయంపై యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ మాల్యా స్పందించారు. ఈ కేసులో గత సంవత్సరం డిసెంబర్ 10నే వెస్ట్ మినిస్టర్స్ కోర్టు న్యాయమూర్తి తీర్పిచ్చారని, ఆ వెంటనే తనకు అప్పీలు చేసుకునే అవకాశం లభించినా, తాను దాన్ని వాడుకోలేదని అన్నారు.

ఇది ఇలా ఉండగా హోం శాఖ కార్యదర్శి నిర్ణయం ఇప్పుడు వెలువడిందని గుర్తు చేసిన ఆయన, ఇప్పుడు అప్పీలు ప్రక్రియను ప్రారంభించనున్నానని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. కాగా, ఇండియాలో బ్యాంకులకు రూ. 9 వేల కోట్లను ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యాను ఎలాగైనా ఇండియాకు రప్పించాలని ఈడీ, సీబీఐ వంటి సంస్థలు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements