ప్రతిభ ఉంటె అమెరికాకు రావాలి..

     Written by : smtv Desk | Wed, Feb 06, 2019, 12:34 PM

ప్రతిభ ఉంటె అమెరికాకు రావాలి..

ఇటీవల అమెరికాలో తెలుగు విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా ప్రభుత్వం ఓ నకిలీ ఉయునివెర్సిటీని రూపొందించి అక్రమంగా వారి దేశానికి వలస వస్తున్నా వారిని పట్టుకోగలిగారు. అయితే ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొన్ని కీలక వ్యాఖలు చేశారు..

ప్రతిభ ఉన్నవారు తమ దేశానికి రావాలనే ఉద్దేశాన్ని మరోసారి బయటపెట్టారు. సోమవారం ఆయన యూఎస్‌ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వలసదారుల అంశాన్ని ప్రస్తావిస్తూ.. తమ దేశానికి వచ్చేవారు న్యాయపరంగా రావాలని కోరారు. అక్రమ వలసదారులు దేశానికి ప్రమాదమని ఆయన అభిప్రాయపడ్డారు.

'అమెరికన్ల ఉద్యోగాలు, వారి భవిష్యత్తుకు రక్షణ కల్పిస్తూ వలస వ్యవస్థను రూపొందించడం మా నైతిక బాధ్యత. మా చట్టాలను గౌరవిస్తూ నేడు లక్షల మంది వలసదారులు అమెరికాలో నివసిస్తున్నారు. న్యాయపరంగా వచ్చే వలసదారులు మా దేశానికి ఎంతగానో ఉపయోగపడుతున్నారు. విదేశీయులు ఇంకా ఎక్కువ మంది మా దేశానికి రావాలనే నేనూ కోరుకుంటున్నాను. కానీ వారు న్యాయపరంగా రావాలి' అని అమెరికా అధ్యక్షుడు తెలిపారు.





Untitled Document
Advertisements