భార్య అశ్లీల చిత్రాలను కుటుంబసభ్యలకు షేర్ చేశాడు ఓ భర్త

     Written by : smtv Desk | Wed, Feb 06, 2019, 09:00 PM

భార్య అశ్లీల చిత్రాలను కుటుంబసభ్యలకు షేర్ చేశాడు ఓ భర్త

దుబాయ్, ఫిబ్రవరి 06: తన భార్య అశ్లీల పనులు చేస్తోందని దారుణానికి పాల్పడ్డాడు ఓ భర్త. పూర్తి వివరాల ప్రకారం ఆసియా ఖండానికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి యూఏఈలో ఉంటున్నాడు. అయితే తన భార్య తప్పుడు పనులు చేస్తోందని అనుమానంతో ఆమె నగ్న ఫోటోలను ఫేస్‌బుక్ మేసేంజర్ ద్వారా భార్య కుటుంబసభ్యులకు పంపాడు.

భార్య సోదరుడు,తండ్రి, తల్లికి మేసేంజర్ ద్వారా ఈ చిత్రాలను షేర్ చేశాడు. ఈ ఫోటోల విషయం తెలుసుకొన్న భార్య భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై భర్తపై ఆమె కేసు పెట్టింది. ఈ విషయమై నిందితుడికి రూ.50 లక్షల జరిమానాను విధించింది కోర్టు. మరోవైపు నగ్న చిత్రాలను షేర్ చేసిన సెల్‌ఫోన్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఈ ఫోన్‌ను డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.





Untitled Document
Advertisements