అతి స్వల్ప విజయ లక్ష్యంతో క్రీజులోకి టీం ఇండియా....

     Written by : smtv Desk | Fri, Feb 08, 2019, 01:35 PM

అతి స్వల్ప విజయ లక్ష్యంతో క్రీజులోకి టీం ఇండియా....

ఆక్లాండ్, ఫిబ్రవరి 08: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా నేడు రెండో టీ20 ఆక్లాండ్ వేదికగా ఈడెన్ పార్క్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ తుది జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు చేయలేదు. మరోవైపు కివీస్‌ కూడా టీమ్‌లో ఎలాంటి మార్పులు చేయకుండానే ఆడుతోంది. ఇకతొలి ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి కివీస్ ను 158/8 పరుగుల వద్ద రోహిత్ సేన పెవిలియన్ కు పంపించేసింది. టీం ఇండియా 159 అతి స్వల్ప విజయ లక్ష్యంతో క్రీజులోకి అడుగుపెట్టి 19/0 పరుగుల వద్ద నిలికడగా ఆడుతోంది.

బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 80 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా... ఈ మూడు టీ20ల సిరీస్‌లో ఆశలు నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన పరిస్థితి. మరోవైపు ఇటీవల సొంతగడ్డపై 1-4 తేడాతో వన్డే సిరీస్‌ని చేజార్చుకున్న న్యూజిలాండ్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి 2-0తో టీ20 సిరీస్‌ని కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉంది.
జట్ల వివరాలు:

భారత్ తుది జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, రిషబ్ పంత్, విజయ్ శంకర్, దినేశ్ కార్తీక్, మహేంద్రసింగ్ ధోని ( వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్





Untitled Document
Advertisements