బ్రేకింగ్ : ఫుట్ బాల్ క్లబ్ లో మంటలు 10మంది సజీవదహనం

     Written by : smtv Desk | Fri, Feb 08, 2019, 04:53 PM

బ్రేకింగ్ : ఫుట్ బాల్ క్లబ్ లో మంటలు 10మంది సజీవదహనం

బ్రెజిల్, ఫిబ్రవరి 08: బ్రెజిల్ లోని ఓ ఫుట్ బాల్ క్లబ్ లో భారీ అగ్ని ప్రమాదం వల్ల దాదాపు 10 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాదం ఎలా జరిగిందన్న విషయం తెలియడం లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తోంది. ప్రమాద సమయంలో క్లబ్ లో ఎంత మంది ఉన్నారనే విషయం తెలియాల్సి ఉంది. క్షతగాత్రుల వివరాలు సంబంధిత అధికారులు తెలుసుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements