సీబీఐ ముందు హాజరైన రాజీవ్‌ కుమార్‌

     Written by : smtv Desk | Sat, Feb 09, 2019, 01:35 PM

సీబీఐ ముందు హాజరైన రాజీవ్‌ కుమార్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 09: శారదా చిట్‌ఫండ్‌, రోజ్ వ్యాలీ కుంభకోణం కేసులో కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ కొరకు ఈరోజు రాజీవ్ కుమార్ సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన నిన్న సాయంత్రమే షిల్లాంగ్‌ చేరుకున్నారు. రాజీవ్ కుమార్ ను షిల్లాంగ్‌లోని సీబీఐ కార్యాలయంలో అధికారులు ప్రశ్నిస్తున్నారు.

కాగా, తమ దర్యాప్తుకు రాజీవ్‌ కుమార్‌ సహకరించడం లేదని సీబీఐ అధికారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీంతో రాజీవ్ కుమార్‌ను సీబీఐ విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు శారదా కుంభకోణంతో సంబంధం ఉన్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ కునాల్‌ ఘోష్‌ను కూడా ఆదివారం షిల్లాంగ్‌లో జరిగే విచారణకు హాజరు కానున్నారు. ఈ కుంభకోణం కు సంబంది విచారణ కొరకు రాజీవ్ కుమార్ ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులను అడ్డుకోవడం, అనంతరం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆందోళనకు దిగిన సంగతి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements