రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' వెర్సెస్ కేసీఆర్ 'ఆర్ఆర్ఆర్'; విజయశాంతి ఆసక్తికర ట్వీట్లు

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 10:30 AM

రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' వెర్సెస్ కేసీఆర్ 'ఆర్ఆర్ఆర్'; విజయశాంతి ఆసక్తికర ట్వీట్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 11: కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా తెలంగాణా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు లక్ష్యంగా వరుస ట్వీట్లు చేశారు. రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'ను తలపిస్తూ కేసీఆర్ ఆర్ఆర్ఆర్(రీజనల్ రింగ్ రోడ్) అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విజయశాంతి చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

విజయశాంతి తన ట్విట్టర్ లో, "రాజమౌళి దర్శకత్వం వహించే 'RRR' చిత్రానికి వచ్చే కలెక్షన్లను అధిగమించే విధంగా కేసీఆర్ గారు కొత్త 'RRR' ప్రాజెక్ట్ కి శ్రీకారం చుట్టారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ కేసీఆర్ గారి 'RRR' ఏమిటంటే రీజనల్ రింగ్ రోడ్" అని వ్యాఖ్యానించారు.

కాగా, "ఈ RRR కు, తెలంగాణ కేబినెట్ విస్తరణలో జరిగే ఆలస్యానికి ఒక లింక్ ఉందని తెరాస నేతలు చెబుతున్నారు. కేసీఆర్ గారి కేబినెట్ లో చేరడమంటే మంత్రులుగా ప్రమాణం చేసేవారు కొంత రిస్క్ చేయక తప్పదని తెలుస్తోంది" అన్నారు.

అలాగే, "కేసీఆర్ గారి కేబినెట్ లో చేరబోయే వారికి విధించబోయే షరతులు ఏమిటంటే, తెరాస ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్ పేరుతో చేయబోతున్న లక్ష కోట్ల కుంభకోణానికి, మంత్రులు ఆమోదముద్ర వేయడంతో పాటు దానికి పూర్తి భాద్యత వహించాలి. రేపు ఏమైనా చట్టపరమైన ఇబ్బందులు వస్తే మంత్రులే భరించాలి, దీనికి సిద్ధపడిన వాళ్లు మాత్రమే మంత్రులుగా ప్రమాణం చెయ్యాలని కేసీఆర్ గారు మెలిక పెట్టారట.

ఈ షరతులకు అంగీకరించని హరీశ్ రావు గారి లాంటి సీనియర్ నేతలను పక్కన పెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది" అని ట్విట్ చేశారు. అంతటితో వదలకుండా, "కేసీఆర్ గారి కేబినెట్లో మంత్రులను రబ్బర్ స్టాంప్ లా వాడుకుంటారని తెలుసు కానీ, ప్రభుత్వం చేసే అవినీతికి ఏజెంట్లుగా మార్చాలనుకోవడం దారుణం" అని వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements