మొన్న కత్తెర, ఇప్పుడు కాలు: రోగులతో వైద్యుల చెలగాటం

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 10:55 AM

మొన్న కత్తెర, ఇప్పుడు కాలు: రోగులతో వైద్యుల చెలగాటం

ఖాబిల్, ఫిబ్రవరి 11: వైద్యో నారాయణో హరి అన్నారు కానీ ఆ వైద్యులే ఇపుడు రోగుల పాలిన మృత్యు శాపంగా మారారు. మొన్న నిమ్స్ హాస్పిటల్ లో ఓ మహిళా కడుపులో కత్తెర పెట్టి మర్చిపోయి ఆపరేషన్ చేసిన ఘటన మరవక ముందే మరోటి ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చిండి. వైద్యులు తమ నిర్లక్ష్యంతో రోగులతో చెలగాటం ఆడుతున్నారు. ఒడిశాలోని ఓ ఆస్పత్రిలో వైద్యులు ఎడమకాలికి చేయాల్సిన వైద్యాన్ని కుడికాలికి చేసేశారు.

పైగా, తాము చేసింది కరెక్టేనంటూ బుకాయించారు. వివరాళ్లోకి వెళ్తే…కియోంఝర్‌ జిల్లాలోని ఖాబిల్‌ గ్రామానికి చెందిన మితారాణి జేనా అనే మహిళ ప్రమాదంలో గాయపడింది. ఆమె ఎడమ కాలికి తీవ్ర గాయం కావడంతో వెంటనే ఆమెను సమీపంలోని ఆనందపూర్‌ ఆస్పత్రికి తరలించారు.

బాధితురాలిని పరీక్షించి వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేయాలంటూ ఆపరేషన్‌ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఆపరేషన్‌ తర్వాత స్పృహలోకి వచ్చిన జెనా, ఎడమ కాలికి చేయాల్సిన ఆపరేషన్‌ కుడికాలికి చేశారంటూ ఆమె కుటుంబ సభ్యుల వద్ద వాపోయింది. దీంతో వారు వైద్యులను నిలదీశారు.

వైద్యుల నిర్లక్ష్యంపై నిరసన వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ముందు ధర్నా చేశారు. పొరపాటుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. వైద్యుల నిర్వాకం వల్ల జెనా ఇప్పుడు నడవలేక మంచానికే పరిమితమైంది.





Untitled Document
Advertisements