తారలు దిగి వచ్చిన వేళ....అమెరికాలో గ్రామీ అవార్డుల సందడి

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 11:07 AM

తారలు దిగి వచ్చిన వేళ....అమెరికాలో గ్రామీ అవార్డుల సందడి

లాస్‌ఏంజెల్స్‌ , ఫిబ్రవరి 11: 61వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవ వేడుకను అమెరికా లాస్‌ఎంజెల్స్‌లోని స్టేపుల్స్‌ సెంటర్‌లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకి అమెరికా ప్రముఖ గాయని ఆలీషియా కీస్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ వేడుకలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామా స్టేజ్‌ పైకి వచ్చి ప్రేక్షకులను సర్‌ప్రైజ్‌ చేశారు.

ఆమెతో పాటు ప్రముఖ అంతర్జాతీయ పాప్‌ గాయకులు 'లేడీ గాగా', 'జెన్నిఫర్‌ లోపేజ్' కూడా స్టేజ్‌పై సందడి చేశారు. అమెరికాకు చెందిన ది రికార్డింగ్‌ కంపెనీ ప్రతి ఏడాది ఈ అవార్డులను ప్రకటిస్తోంది. తొలి గ్రామీ అవార్డు వేడుకను 1959 మే 4 న నిర్వహించారు. అప్పట్లో దీనిని 'గ్రామోఫోన్‌ అవార్డు' అని సంబోధించేవారు. ఏటా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ వేడుకకు ముందు ఈ గ్రామీ వేడుక జరుగుతుంది.

వినోదాత్మక రంగంలో తమ గాత్రంతో, పాటలతో ప్రేక్షకులను అలరించిన వారికి ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ వేడుకలో దిస్‌ ఈజ్‌ అమెరికాగ పాట సాంగ్‌‌ ఆఫ్‌ ది ఇయర్‌గగా నిలిచింది. ప్రముఖ గాయకుడు డొనాల్డ్ మెక్‌ కిన్లే గ్లోవర్‌ ఈ పాటను కంపోజ్‌ చేశారు. ఈ ఆల్బమ్‌ నాలుగు కేటగిరీల్లో అవార్డు గెలుచుకుంది.





Untitled Document
Advertisements