దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టేసింది

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 11:57 AM

దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను   న్యాయస్థానం కొట్టేసింది

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్‌ఫండ్‌ కుంభకోణం కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. శారద గ్రూప్ పేరుతో 200 ప్రైవేటు సంస్థలు నడిపిన పొంజీ స్కీం నష్టపోవడంతో కోటి 70 లక్షల మంది డిపాజిటర్ల బతుకులు రోడ్లమీద పడిన సంగతి తెలిసిందే.

ఈ కేసు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. కాగా ఈ కేసు దర్యాప్తు మేరకు ఇప్పటికే పలువురు ప్రముఖులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబందించిన ఆధారాలను ధ్వంసం చేశారనే ఆరోపణలతో కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ను సీబీఐ విచారిస్తుంది. మరోవైపు శారదా కుంభకోణంతో సంబంధమున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు ఎంపీ కునాల్‌ ఘోష్‌ కూడా సీబీఐ విచారణకు హాజరయ్యారు.





Untitled Document
Advertisements