చంద్రబాబు దీక్షకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 01:36 PM

చంద్రబాబు దీక్షకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మద్దతు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ రాజధానిలో చేపట్టిన దీక్షకు పలువురు ప్రముఖలు సంఘీభావం తెలిపారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఈ దీక్షకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు తమ పార్టీ ప్రతినిధి డెరెక్‌ ఓ బ్రెయిన్‌ ద్వారా దీదీ సంఫీుభావ సమాచారాన్ని బాబుకు పంపారని తృణమూల్‌ నాయకుడు ఒకరు తెలిపారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడంలో ప్రతిపక్షం ఎప్పుడు ఐక్యంగా ఉంటుందని ఈ సందర్భంగా దీదీ స్పష్టం చేశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ రాజ్యాంగ పరిరక్షణ పేరుతో కోల్‌కతాలో మమతా బెనర్జీ దీక్ష చేపట్టగా చంద్రబాబు కోల్‌కతా వెళ్లి మరీ తన మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే చంద్రబాబు చేపట్టిన దీక్షకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, నేషనల్ కాన్ఫరెన్స్‌ పార్టీ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా మద్దతు తెలిపారు.

Untitled Document
Advertisements