షాకింగ్: 9 ఏళ్ల బాలుడి పై మహిళ అత్యాచారం

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 02:05 PM

షాకింగ్: 9 ఏళ్ల బాలుడి పై మహిళ అత్యాచారం

తిరువనంతపురం, ఫిబ్రవరి 11: తొమ్మిదేళ్ల బాలుడిపై 36 ఏళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడిన సంఘటన కేరళలో కలకలం రేపింది. సమీప బంధువైన మహిళే బాలుడిపై ఈ అఘాయిత్యానికి పాల్పడటం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... మల్లాప్పురం పట్టణం తెన్హిపాలెంకు చెందిన 9 ఏళ్ల బాలుడిపై అతని సమీప బంధువు అయిన 36 ఏళ్ల మహిళ అత్యాచారానికి పాల్పడింది. కాగా.. బాలుడి ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు.

బాలుడికి చికిత్స అందించిన డాక్టర్లు వెంటనే ఛైల్డ్ లైన్ అధికారులకు సమాచారం అందించారు. గత కొన్ని నెలలుగా మహిళ బాలుడిపై అత్యాచారానికి పాల్పడుతోందని.. దీంతో బాలుడి మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని వారు ఆరోపిస్తున్నారు. చైల్డ్ లైన్ అధికారుల సహాయంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సదరు మహిళను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. అయితే.. రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాల కారణంగా తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మహిళ పోలీసులకు చెప్పడం గమనార్హం. ఈ విషయంలో నిజానిజాలు తేల్చే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారని సమాచారం.

Untitled Document
Advertisements