'అలాద్దిన్' ట్రైలర్ విడుదల, సినిమా రిలీజ్ తేది ఖరారు

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 02:10 PM

'అలాద్దిన్' ట్రైలర్ విడుదల, సినిమా రిలీజ్ తేది ఖరారు

హైదరాబాద్, ఫిబ్రవరి 11: మనం చిన్నప్పటి నుంచి వింటున్న అల్లావుద్దీన్ కథ ఇప్పుడు హాలీవుడ్ తెరపై సందడి చేయనుంది. అల్లావుద్దీన్ కథపై ఇప్పటికే ఎన్నో సినిమాలు, ఫెయిరీ టైల్స్ వచ్చాయి. ఈ కథలోని జీని పాత్ర అందరికి సుపరిచితమే. డిస్నీ సంస్థ తాజాగా ఈ చిత్రాన్ని తెరకేక్కించింది. 'అల్లాద్దీన్' చిత్రానికి సంబందించిన ట్రైలర్ ను డిస్నీ సంస్థ విడుదల చేసింది.

ఈ సినిమాలో హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్, నయోమి స్కాట్, మేనా మస్సుద్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ప్రతిష్టాత్మకమైన జీని పాత్రలో విల్ స్మిత్ నటించారు. గుయ్ రిట్జీ 'అల్లాద్దీన్' సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సంవత్సరం మే 24 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements