గో బ్యాక్ మోదీ.. వైరల్ అవుతున్న హాష్ టాగ్

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 02:11 PM

గో బ్యాక్ మోదీ..  వైరల్ అవుతున్న హాష్ టాగ్

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: గో బ్యాక్ మోదీ.. ఈ హాష్ టాగ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. మొన్నటి నుంచి వైరల్ అవుతున్న హాష్ టాగ్ ఇది. ఆదివారం ఉదయంతో ట్రెండింగ్ లోకి వచ్చింది. అసలు ఈ గో బ్యాక్ మోదీ ఏంది.. అసలు ఏంటి సంగతి అంటారా?

మోదీ నిన్న ఆంధ్రాకు వస్తున్నారు కదా. అందుకే.. టీడీపీ మద్దతుదారులు, ఎల్లో మీడియా.. అన్నీ నిద్రలేచాయి. మోదీపై ఎంత విషం చిమ్మాలో అంత చిమ్ముతున్నారు. అందుబాటులో ఉన్న అన్ని ప్లాట్ ఫాంలను ఉపయోగించుకుంటున్నారు. దాని భాగంగా వచ్చిందే గోబ్యాక్ మోదీ హాష్ టాగ్. దానితో పాటు ఆంధ్రాలోని చాలా ప్రాంతాల్లో గో బ్యాక్ మోదీ పేరుతో బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి.

వాటిని పచ్చ మీడియా సోషల్ మీడియాలో షేర్ చేయడం.. వైరల్ చేయడం ఇదే వాళ్లు చేస్తున్న పని.కార్టూన్లుగా మోదీని చిత్రీకరించి… నోమోర్ మోదీ, మోదీఈజ్ఏమిస్టేక్ పేర్లతోనూ హోర్డింగ్ లను ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా టీడీపీ పనేనని.. కావాలని ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు.. ప్రధాని మోదీపై బురద జల్లుతున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మోదీ ఆంధ్రా విజిట్ కు ఒక్కరోజు ముందు అస్సాం వెళ్లారు. అక్కడ కూడా మోదీకి నిరసనల సెగ తగిలింది. పౌరసత్వ సవరణ బిల్లుపై అస్సాంలోని నిరసనకారులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆయన వెల్ కమ్ చెప్పారు.

Untitled Document
Advertisements