లేడి కాదు కేడి....జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆడ రౌడీ

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 02:18 PM

లేడి కాదు కేడి....జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఆడ రౌడీ

బెంగళూరు, ఫిబ్రవరి 11: మనం చాలా ప్రాంతాల్లో రౌడీషీటర్లు వాళ్ల దౌర్జన్యాలు గురించి చూశాం, విన్నాం. అయితే మహిళా రౌడీషీటర్ల గురించి ఎక్కడైనా విన్నామా..? ఇలాంటి వారిని సినిమాల్లోనే చూశాం తప్ప నిజ జీవితంలో ఇలాంటి వారు బహుశా మనకి తారస పది ఉండరు.

వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నగరంలోని చెన్నమ్మన కెరె అచ్చుకట్టు ప్రాంతంలో యశస్విని అనే లేడి.. ఒక గ్యాంగ్‌ని ఏర్పాటు చేసుకుని స్థానికంగా ఉన్న జనాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈమె ఆగడాలకు అడ్డు-అదుపు లేకుండా పోవడంతో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఆమెపై రౌడీషీట్ తెరిచారు. అక్కడ తన ఆటలు సాగకపోవడంతో నగరంలోని ఉత్తర ప్రాంతానికి మకాం మార్చీ అక్కడ రౌడీయిజం చేస్తోంది. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం బాగలకుంటే ప్రాంతానికి చెందిన లలిత అనే మహిళ యశస్వినిపై గంగమ్మనగుడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కేసు తుది విచారణలో భాగంగా లలితను న్యాయస్థానానికి వెళ్లకుండా యశస్విని తన వద్ద ఉన్న మరో 8 మంది మహిళా రౌడీలతో లలితను గురువారం అడ్డుకుంది.

ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర గాయాలతో పడివున్న లలితను గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరోసారి లలిత ఫిర్యాదుతో యశస్వినిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Untitled Document
Advertisements