టీడీపీ-బీజేపీ ప్రైవేట్‌ ప్రేమాయాణం గుట్టు రట్టు

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 02:20 PM

టీడీపీ-బీజేపీ ప్రైవేట్‌  ప్రేమాయాణం గుట్టు రట్టు

అమరావతి, ఫిబ్రవరి 11: వైసిపి ఏంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ధ్వజమెత్తారు. బీజేపీ-టీడీపీ రహస్యం గుట్టు రట్టైందని, ప్రైవేట్‌గా కొనసాగిస్తున్న ప్రేమాయాణాన్ని బయట పెట్టారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో టీడీపీ నేతలతో పాటు బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షమయ్యారు.

ట్విట్టర్ లో ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్‌ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే, తన ట్విట్టర్ లో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌ను ఎద్దేవా చేశారు.

దీక్ష పేరిట పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వందల కోట్ల ప్రజల దనాన్ని వృధా చేస్తున్న చంద్రబాబుని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు రూ. 200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు. తమ సొంత పనులకు హెలికాప్టర్‌, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాను దొంగిలించడన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చిరించారు.

మరో వైపు లోకేశ్ బాబుకి ఇండిపెండెన్స్‌ డేకు రిపబ్లిక్‌ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చినబాబు పై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీతగీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేష్‌ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో A గ్రేడ్ ఇవ్వక తప్పుదని అభిప్రాయపడ్డాడు.

Untitled Document
Advertisements