మరణానంతరం నా అవయవాలను దానం చేస్తా: చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 03:08 PM

మరణానంతరం నా అవయవాలను దానం చేస్తా: చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్

హైదరాబాద్, ఫెబ్రవరి 11: మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు తన అంగీకార పత్రాన్ని అపోలో ఆసుపత్రికి అందజేశారు. ఈ విషయాన్ని కల్యాణ్ దేవ్ ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు.

"ట్విట్టర్ లో సరైన సందర్భంగానే అభిమానులు, ప్రజల ముందుకు రావాలనుకున్నా. మరణానంతరం నా అవయవాలను దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేశా. మనం ఈ ప్రపంచాన్ని వదిలివెళ్లేటప్పుడు దేన్నీ వెంట తీసుకెళ్లలేం" అని కల్యాణ్ దేవ్ ట్వీట్ చేశారు.

Untitled Document
Advertisements