కేసీఆర్ పుట్టిన రోజుకు భారి ఎత్తున ఏర్పాట్లు

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 03:14 PM

కేసీఆర్ పుట్టిన రోజుకు భారి ఎత్తున ఏర్పాట్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 11: తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు ఈ నెల 17న కాగా భారీగా ఎత్తున వేడుకను జరిపేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాట్లు చేస్తుంది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. వేడుకల్లో భాగంగా హైదరాబాద్, నక్లెస్ రోడ్ లోని జలవిహార్‌ లో వివిధ కార్యక్రమాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈరోజు ఏర్పాట్లను పరిశీలించిన తరువాత మీడియా తో మాట్లాడిన తలసాని, చంద్రశేఖర్ రావు నిర్వహించిన హోమాలు, యజ్ఞాల వివరాలతో పాటు కేసీఆర్ చిన్ననాటి విశేషాలతో కూడిన ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్ ను ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పుట్టిన రోజు వేడుకలకు కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని, తెలంగాణ కళాకారులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements