కొడుకు కోసం తండ్రి రాసిన 'రొమాంటిక్' కథ

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 03:20 PM

కొడుకు కోసం తండ్రి రాసిన 'రొమాంటిక్' కథ

హైదరాబాద్, ఫిబ్రవరి 11: దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి బాల నటుడిగా సినీ పరిశ్రమలో అడుగు పెట్టి ఇప్పుడు హీరోగా మారాడు. ఆకాష్ హీరోగా నటించిన 'ఆంద్ర పోరి' , 'మహబూబా' చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దాంతో హీరోగా నిలదొక్కుకోవడానికి ఆకాష్ బాగానే కష్టపడుతున్నాడు. ఇప్పుడు మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఆకాష్ మూడో సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాకు 'రొమాంటిక్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు. పూరీ జగన్నాథ్ స్వయంగా తన కొడుకు కోసం ఈ కథను సిద్ధం చేసారు.

పూరీ తన అసిస్టెంట్ అనిల్ పడురిని ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. నేడు ఈ సినిమా షూటింగ్ లాంచనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్, సీనియర్ నటి రమ ప్రభ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. కళ్యాణ్ రామ్ ఈ చిత్రానికి క్లాప్ కొట్టి ప్రారంభించారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ బ్యానర్‌లో ఈ సినిమాను నిర్మిస్త్రున్నారు. ఈ సినిమా విషయంలో పూరీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమాతో ఖచ్చితంగా ఆకాష్ కి బ్రేక్ లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

గతంలో పూరీ తన తమ్ముడు సాయిరాం శంకర్ ను కూడా హీరోగా నిలబెట్టడానికి చాలా కష్టపడ్డాడు. తానే స్వయంగా కథ రాసి 'బంపర్ ఆఫర్' సినిమాతో సాయిరా కి హిట్ ఇచ్చాడు. కానీ తర్వాత సాయిరామ్ హీరోగా ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఈ సారి అయినా పురీ తన కొడుకును హీరోగా నిలబెట్టడంలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి.

Untitled Document
Advertisements