దినేష్ కార్తీక్ పై ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు

     Written by : smtv Desk | Mon, Feb 11, 2019, 03:36 PM

దినేష్ కార్తీక్ పై ట్రోలింగ్ చేస్తున్న నెటిజన్లు

న్యూజిలాండ్ తో ఆదివారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్ చేసిన చిన్న తప్పిదం కారణంగా భారత్‌కి మ్యాచ్‌ దూరమైందని మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరి మూడు ఓవర్లలో విజయానికి 48 పరుగులు అవసరమైన సమయంలో భారత్‌ పోరాడిన తీరు అసాధారణం.ఇండియా విజయానికి ఆఖర్లో 28 బంతుల్లో 68 పరుగులు అవసరంకాగా.. అప్పటికే ఆరు వికెట్లు చేజారడంతో న్యూజిలాండ్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు. దినేశ్ కార్తీక్ (33 నాటౌట్), కృనాల్ పాండ్య‌ (26 నాటౌట్) జోడీ అసాధారణ హిట్టింగ్‌తో భారత్‌ను లక్ష్యానికి చేరువ చేశారు. కానీ, ఆఖరి ఓవర్‌లో విజయానికి 16 పరుగులు అసరమైన దశలో కార్తీక్ చిన్న తప్పిదం కారణంగా మ్యాచ్‌ చేజారిందని సంజయ్ పేర్కొన్నాడు

"దినేశ్ కార్తీక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కానీ.. టీ20ల్లో చిన్న తప్పిదాలే మ్యాచ్‌పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఆఖరి ఓవర్‌లో దినేశ్ కార్తీక్‌ సింగిల్ తీసేందుకు నిరాకరించడమే అతను చేసిన పెద్ద తప్పిదం" అని మంజ్రేకర్ ట్విట్టర్‌లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

ఇది ఇలా ఉండగా మూడో బంతికి దినేశ్‌ కార్తీక్‌ పరుగుకు నిరాకరించడంతో కామెంటరీ బాక్స్‌లో ఉన్న గౌతంగంభీర్‌ దినేశ్‌ నిర్ణయాన్ని తప్పుపట్టాడు. అవతలి ఎండ్‌లో ఉన్నది కృనాల్‌పాండ్యా.. అతడు టెయిలెండర్‌ కాదు అప్పటికే ధాటిగా ఆడుతున్నాడు. అని అసహనం వ్యక్తం చేశారు. అచ్చం ఇలాగే 2012లో కామన్‌వెల్త్‌ సిరీస్‌లో ధోనీ.. రవిచంద్రన్‌ అశ్విన్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా ధోనీ సింగిల్‌ను నిరాకరించి రెండు బంతులు మిగులుండగానే జట్టును గెలిపించాడు. ఈ ఘటనను గుర్తు చేసుకొని నెటిజెన్లు దినేశ్‌ కార్తీక్‌పై ట్వటర్‌లో మండిపడుతున్నారు. నువ్వేమైనా ధోనీ.. కృనాల్‌ ఏమైనా అశ్విన్‌ అనుకుంటున్నావా?.. కార్తీక్‌ సింగిల్‌ ఎందుకు తీయలేదు.. నువ్వేమైనా ధోనీ అనుకుంటున్నావా అంటూ ట్విటర్‌లో కామెంట్లు చేస్తున్నారు.

Untitled Document
Advertisements